చత్తీస్ గడ్ లో మావోస్టుల ఘాతుకం : 8మంది జవాన్ల మృతి

40

చత్తీస్ గడ్ లో మావోస్టుల ఘాతుకం

చత్తీస్ గడ్ లో మావోస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. మందు పాతర పేల్చి9మందిని పొట్ట పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు జావన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుకుమా జిల్లా గొల్లపల్లి – కిష్టారం గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. అనంతరం కాల్పులతో తెగబడ్డారు.

కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలను ఏరివేసేందుకు కోబ్రా దళాలు.. ఉదయం నుంచి చుట్టుముట్టాయి.  సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మాటువేసిన మావోయిస్టులు.. జవాన్లపై దాడిచేశారు. మావోలు పెట్టిన మందుపాతర పేలి.. జావాన్లు వెళ్తున్న వాహనం నుజ్జు నుజ్జయ్యింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

అనంతరం మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ కు చెందిన 212 బెటాలియన్ జవాన్లు మృతి చెందారు. గాయపడిన వారిని రాయపూర్ లోని హాస్పిటల్ చేర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జవాన్ల మృత దేహాలను భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి హెలికాఫ్టర్ ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.