ధర్మశాలలో రజని కాంత్

44

రజనీకాంత్ కు హిమాలయాల పర్వతాలతో అవినాభావ సంబంధం వుంది. సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తరువాత ఆయన మానసిక ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తుంటారు. అక్కడ ఆధ్యాత్మిక గురువుల దగ్గర ఆధ్యాత్మిక బోధనలు విని వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు అలవాటు. ప్రస్తుతం తాను నటించిన కాల సినిమా షూటింగ్ పూర్తి కావడం తో ఆయన హిమాలయాలకు వెళ్లారు. నిన్న సిమ్లాలో వున్నా ఆయన ఈరోజు ధర్మశాలకు చేరుకున్నారు. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు ఆయన రిషికేతేష్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఆయన తన రాజకీయ పార్టీ పనులతో బిజీ కానున్నారు. ఇప్పటికే పార్టీ పేరు ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ గా తమిళనాడు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ నటించిన కాల సినిమా ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధం గా వుంది. దీంతో పాటు శంకర్ దర్శకత్వం తో నటిస్తున్న 2.0 ఈ ఏడాది దీపావళికి మన ముందుకు రానుంది.