” హామీలను నేరవేర్చే విధంగా ” ఎన్నికల కమిషన్” బాధ్యతలు తీసుకోవాలి.. : వీహెచ్

0

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు డాక్టర్ భీమ్ రావు అంబెద్కర్ 62వ వర్ధంతిని పురష్కరించుకోని అంబెద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను గెలిచిన పార్టీ నెరవేర్చే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక భాధ్యతలు తీసుకోవాలని వీహెచ్ కోరారు.. ఎన్నికల హామీలకు నిర్ధిష్ట మైన ప్రాధాన్యతను తీసుకు రావాలని అప్పుడే ఓటరు ఓటుకు న్యాయం చేసినట్టు అవుతుందని ఆయన అన్నారు..

ఎన్నికల్లో గెలిచిన పార్టీ తమ ఐదేళ్ల పాలనలో పూర్తీ చేయని పక్షంలో ఆ పార్టీ నాయకులపై పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అప్పుడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని సాధ్యమయ్యే హామీలనే మాత్రమే ప్రకటిస్తారని వీహెచ్ అన్నారు.

కాగా దీనిపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ వీహెచ్ ఆలోచన మంచిదైనప్పటికి, భారత దేశ రాజ్యంగం ప్రకారం అలాంటి ప్రత్యేక బాధ్యతలు ఇప్పటివరకు ఎన్నిక సంఘం కు లేవని తెలిపారు.. భారత దేశ రాజకీయం, రాజ్యంగ బద్దంగా నిర్మిత మైనదని అందులో ఎన్నికల ను నిస్పక్షపాతంగా వ్యవహరించేందుకు మాత్రమే చర్యలకు తీసుకునే బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ..