చంద్ర బాబు సీఎం కాదు “భూ ఆసురుడు”… సోము వీర్రాజు

0

తూర్పుగోదావరి జిల్లా విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లుడుతూ భారత రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు లాంటి అవినీతి ముఖ్యమంత్రి మరోక్కరు లేరు.. భూదందాల ఆయన్నుమించిన వారు లేరని విరుచుకు పడ్డారు.. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర అభివృద్ధి నిర్మాణం ముసుగులో భూ దందా, రియల్ మాఫియాను కొనసాగిస్తున్నాడని ఆయన ఆరోపనలు చేశారు.. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెప్పి త్రీడి చిత్రాలు చూపించి నాలుగున్న సంవత్సరాలు పబ్బం గడిపారని, వాల్లోచ్చారు, వీళ్ళోచ్చారు అంటూ కథలు చెబుతూ రైతుల నుండి కారుచౌకగా వేల ఎకరాల్ని కొని రియల్ ఎస్టేట్ లో కోట్లు కొల్లగొట్టే సొంత ప్రణాళిక రచించుకున్నారని సోము ఎద్దేవ చేశారు..

దేశం మొత్తం మీద ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద ఏటా దేశంలోని 29 రాష్ట్రాలకు ఒక్కోదానికి రూ.రెండువేల కోట్లు చొప్పున వస్తుంటే, ఆంధ్ర రాష్ట్రానికి రూ.పదివేల కోట్లు తెచ్చుకున్నారని, అయితే చెరువుల తవ్వకాల పేరుతో భారీ మొత్తంలో చంద్రబాబు కాజేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్ని కూడా బాబు ప్రవేశ పెట్టినట్లు చూపించుకున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ పార్టీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని విమర్శిలు చేశారు.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎలా సిద్ధ మవుతాడంటూ చంద్రబాబు తీరుపై సోము విరుచు పడ్డారు.. తెలుగు దేశం పార్టీ నాయకులకు ప్రజల కష్టాలు పట్టవని మళ్లీ అధికారంలోకి వస్తే మరింత దోచేస్తారని అన్నారు.. ఈ సమావేశంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..