విజయవాడలో “ఎఫ్2” సినిమా హీరోయిన్ మెహ్రీన్ సందడి!

0

విజయవాడలో సినీనటి మెహ్రీన్ కౌర్ పిర్జధా సందడి చేశారు. ఒక వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి వచ్చిన మెహ్రీన్ తను నటించిన ఎఫ్ 2 సినిమా జనవరి 11 న విడుదల కానున్న సందర్భంగా, సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల గా వస్తున్నా అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు. పేరుకు తగ్గట్టుగానే సినిమాలో చాల ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, తప్పకుండ అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని, ఈ విధంగా అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మెహ్రీన్ తెలిపారు. దుకాణ దారుడు మాట్లాడుతూ వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంచామని, సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడంతో త్వరగా వినియోగదారులకు చేరువయ్యేందుకు వస్త్రాల పై ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రకటించారు.