లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కన్నమూత..!

0

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ(89) సోమవారం ఉదయం తుదిస్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఛటర్జీ ఈ నెల 7వ తేదీ నుంచి కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమనాథ్ గుండెపోటుకు గురయ్యారు… దీంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఛటర్జీ కన్నుమూశారు.

సీపీఎం లో కీలక నాయకుడిగా కొనసాగారు సోమనాథ్. 1968లో పార్టీలో చేరిన సోమనాథ్.. 10సార్లు లోక్ సభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇదే క్రమంలో యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా కొనసాగారు. అణు ఒప్పందం అంశంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో సోమనాథ్ ను 2008లో సీపీఎం నుంచి బహిష్కరించడం జరిగింది. యూపీఏ -1 కూటమి నుంచి సీపీఎం వైదొలిగినా.. ఆయన మాత్రం స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు.