ఎగిరే టాక్సీ లు వచ్చేసాయి

0

అవును మీరు విన్నది నిజమే బెల్ ఏరోస్పేస్ సంస్థ ఇంకా ఉబెర్ సంయుక్తంగా నిర్మించిన ఎగిరే టాక్సీ నమూనాని “లాస్ వేగాస్ ” లో జరిగిన “సి ఇ యస్-2019” లో ప్రదర్శించారు. దీని పేరు “బెల్ నెక్సస్ ” ఒక్క సారి ఛార్జ్ చేస్తే 150 మైళ్ళు వెళ్లగలదు . పైలట్ ఇంకా 4 ప్రయాణికులు మొత్తం కలిపి 5 మందీని తీసుకు వెళ్లగలిగే సామర్థ్యం వీటికి ఉంది. వి-22 ఆస్ప్రేయ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉపయోగించిన టిల్టెడ్ ఫ్యాన్ టెక్నాలజీ నే ఇందులో కూడా ఉపయోగిస్తున్నారు. కేవలం బెల్,ఉబెర్ సంస్థలే కాకుండా సాఫ్రాన్,ముగ్ ,థేల్స్, గర్మిన్ ,ఇ. పి.యస్ వంటి సంస్థలు కూడా దీనికి సహకారాన్ని మరియు సాంకేతికతను అందించాయి.

దీనికి 6 ఆర్టిక్యులేటెడ్ ఫాన్స్ ఉన్నాయి వాటి ద్వారా మాములు హెలికాప్టర్ లాగా నిటారుగా గాలి లోకి ఎగరగలదు. గాలి లోకి వెళ్లిన తర్వాత ఫ్యాన్లు ముందు వైపుకి తీరుతాయి దీని వలన ఇది ముందుకి వేగంగా కదులుతుంది. ఇక కిందకు దిగే సమయంలో ఫ్యాన్లు మరల ఫై వైపు తిరిగి దిగటానికి సహకరిస్తాయి . దీనికి ఉన్న హైబ్రిడ్ శక్తీ వ్యవస్థ వల్ల చాల తక్కువ శక్తిని ఉపయోగించుకుంటుంది. మరియు చాల తక్కువ శబ్దాన్ని వెలువరుస్తుంది. 2020 లో విడుదల అవబోతున్న ఈ బెల్ నెక్సస్ 2023 కల్లా అందుబాటులోకి రానుంది. దీనిని ఉబెర్ సంస్థ ఎయిర్ టాక్సీగా వినియోగించనుంది . కానీ భారత దేశం లోకి అందుబాటు లోకి రావాలి అంటే మరి కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే.

>>త్వరలో మన ముందుకు రానున్న ఎగిరే టాక్సీలు
>>బెల్‍ – ఉబెర్ సారథ్యంలో ఎగిరే టాక్సీ నమునా
>>పైలట్ ఇంకా 4గురు ప్రయాణికులు కూర్చోవడానికి సయిపోయే స్థలం
>>2023 సంవత్సరంలో అందుబాటులోకి రానున్న ఎగిరే టాక్సీలు