క్లారిటీ… కేసీఆర్ పై పోటీకి సై అంటున్న గద్దర్

57
Gaddar Said to contest on KCR medak, gajvel

గతంలో గద్దర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. కాగా కేసీఆర్ మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటిచేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ప్రస్తుతం గద్దర్ తాను కూడా ఇండిపెండెంట్ గా కేసీఆర్ పై పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు..

ఈ రోజు ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం మీడియా సమావేవంలో మాట్లాడుతూ తాను ఏ పార్టీతరుపునా పోటీలో నిలబడటం లేదని తెలిపారు.. తాను ఒక పార్టీకి చెందిన వ్యకిని కాదని.. తను ప్రజల పక్షం అని, బడుగు బలహీనుల సంక్షేమమే తన లక్షమని అన్నారు.. ఇక తను రాహుల్ గాంధీ, సోనియాలను కలిసింది రాజకీయాల కోసం కాదని వాళ్లతో మాడ్లింది కూడా పాలకోసమని తెలిపారు.. తన గొంతుతో 45 నిమిషాలు పాటలు పాడి వినిపించానని అన్నారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ పుస్తకం గురించి వివరించానని అన్నారు.

ఇక తనకు భద్రత కల్పించాలని డిల్లీలో సీఐడీ అడిషనల్ డీజీని కలిశాని, ఇదే విషయమై చీప్ ఎలక్షన్ కమీషన్ అధికారిని కలిసి వివరించానని చెప్పారు.. ఇక తన ఎన్నికల ప్రచారంలో నాలుగు దశల్లో జరుగుతుందని వివరించారు ఇందులో ఎస్టీ, ఎస్సీ,బీసీ, పేద ఓటర్లుంటారని తెలిపారు..

ఇక తనపై ఎన్నికేసులున్నాయో కూడా తనకి గుర్తు లేవని చెప్పారు.. సాధారణ అవినీతి కంటే రాజకీయ అవినీతి ధారణమైందని అన్నారు. శాంతి చర్చలకోసం ఎందరినో కలివానని… తనకు ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరినైనా కలిసే హక్కుయ తనకుందని , అలాగే భావ ప్రకటన స్వేచ్చ లేనప్పుడు ఈ రాజ్యాంగం, ఎన్నికలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.. కాగా తను ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తోంది సంపాదించు కోవడం కోసం కాదని, ప్రజలకు సేవచేయడానికే అని ఆయన అన్నారు.