“హార్దిక్ పటేల్’ కు పోటీగా ‘జడేజా భార్య’…

0

పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పాండ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ పార్టీ నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఈ సీటును హార్దిక్ పటేల్ కు కేటాయించినట్లు తెలిపింది. అయితే ఇతడికి పోటీగా బీజేపీ బలమైన అభ్యర్దినినే పోటీలో దించనున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా బీజేపీ లో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాను ఆ పార్టీ బరిలోకి దించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాంతంలో పటేల్ సామజిక వర్గం అధికంగా ఉండటంతో హార్దిక్ ఇక్కడి నుంచి పోటీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇక రివాబా ఇక్కడినుంచే బరిలోకి దిగడానికి బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం ఆమె కర్ణిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఆమె బీజేపీలో చేరారు. ఈ ప్రాంతంలో కర్ణిసేన బలంగా ఉండటంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రివాబా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చి 19 సాయంత్రం బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రానుంది.