ఐదేళ్ల చిన్నారిపై కామదాహం తీర్చుకున్న మృగాడు..!

25

చట్టాలు మారాయి, శిక్షలు మారాయి.. కానీ సమాజంలో కామాంధులు కామ వాంఛన మాత్రం తీరలేదు.క్షణకాల సుఖం కోసం వావి వరుసలు కూడా మరచి ప్రవర్తిస్తున్న ఈ మృగాళ్ల చేతిలో ఆడపిల్ల నగిలిపోతుంది. నన్ను వదలండి అని గగ్గోలు పెడుతుంది. అయినా కూడా వదలటం లేదు ఈ మగాళ్లు. దిశ లాంటి యువతులు ఎందరో ప్రాణాలను బలితీసుకున్న కూడా మగాళ్ల కూరత్వం ఆగలేదు.

దిశ కేసు పూర్తిగా మర్చిపోక ముందే గుంటూరులో మరో దారుణం వెలుగు చూసింది.. దిశా కేసు మరువక ముందే మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై ఓ కామాందుడు అత్యాచారం చేసిన ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది. గుంటూరు పరిధిలో రామిరెడ్డి ప్రాంతంలో నివాసముంటున్న ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదివే విద్యార్ధి అత్యాచారం చేసాడు.

అయితే, పాప కు విపరీతమైన కడుపు నొప్పి వస్తుందని తెలపడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగిందని వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను చికిత్స కోసం గుంటూరు కు తరలించారు.