ఎవ‌తో ఒక‌తి.. ఎవ‌డితోనో ప‌డుకుంటే.. నేను స‌మాధానం చెప్పాలా..?

13

ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌రెడ్డిల‌ను ఉద్దేశించి జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బుధ‌వారం నాడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరులో జ‌న‌సేన ప్ర‌జా పోరాట యాత్ర బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌లో పాల్గొన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వాడు ఒక‌డుంటాడు. ఎవ‌డితోనో.. ఎవ‌తో ఒక‌తి ప‌డుకుంటే.. దానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాలంటారు. నా బ‌తుకు అలా అయిపోయింది అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

నేనేం చేయ‌నురా బాబూ.. మీరూ.. మీరూ.. ప‌డుకుని.. దానికి నేను స‌మాధానం చెప్పాలంటే.. ఎలారా బాబూ. అంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వాడు అంత చుల‌క‌న అయిపోయాడా..? ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా రోడ్డు మీద‌కు వ‌చ్చాడు కాబ‌ట్టి ప‌వన్ అంత చుల‌క‌న అయిపోయాడా..? అంటూ ప్ర‌శ్నించాడు.

అంతేకాకుండా, ఎలా ప‌డుకుంది..? ఎవ‌రితో ప‌డుకుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌తో ప్రోగ్రామ్‌లు, ఇంట‌ర్వ్యూలు. ఆరు నెల‌ల‌పాటు ఇదే యావ‌. అదే రౌడీ ఎమ్మెల్యేల‌తో ప్రోగ్రామ్‌లు ఎందుకు చేయ‌రు..? ఎందుకంటే.. భ‌యం. ఆ రౌడీ ఎమ్మెల్యేలు త‌మ‌ను చంపేస్తారేమోన‌ని భ‌యం.

స‌మావేశం చివ‌ర్లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. పాత్రికేయులు, మీడియా సోద‌రుల్లారా.. మీరే చెప్పాలి. కేవ‌లం నా జీవితం మీదే ఎందుకు ఇలా జ‌రుగుతుందంటూ న‌వ్వుతూ ప్ర‌సంగించారు.

ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌ల కాలంలో న‌టి శ్రీ‌రెడ్డి టాలీవుడ్‌లో త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని, దానికి ప‌వ‌న్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ మీడియా వేదిక‌గా చెప్పిన విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క దెందులూరులో ప్ర‌సంగించిన ప‌వ‌న్ స‌భ ఆధ్యాంతం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలా శ్రీ‌రెడ్డి, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు దెందులూరు వేదిక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు జ‌న‌సేన సైనికులు.