వివాహేత‌ర సంబంధం విష‌యంలో.. టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌..!

0

తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి టీడీపీలో వ‌ర్గ విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి. కొప్ప‌వ‌రంలో ఇద్ద‌రు నేత‌లు ఏకంగా రోడ్డుపై కొట్లాట‌కు దిగారు. దీంతో కొప్ప‌వ‌రం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అన‌ప‌ర్తి మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు వెంక‌ట‌రామిరెడ్డి, ఎంపీటీసీ స‌ర్రెడ్డి మ‌ధ్య తీవ్ర స్థాయిలో గొడ‌వ జ‌రిగింది.

ఓ వివాహేత‌ర సంబంధానికి సంబంధించిన వ్య‌వ‌హారాన్ని ఇరువురు కూడా రెండు ప‌క్షాల త‌రుపున నిర్వ‌హించిన పంచాయితీ కాస్తా.. బెడిసి కొట్ట‌డంతో నేత‌లిద్ద‌రు కూడా బాహాబాహీకి దిగారు. ఎంపీటీసీ స‌ర్రెడ్డి వ‌ర్గం వెంక‌ట‌రామిరెడ్డి ఇంటిపై దాడికి దిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ దాడిలో టీడీపీ అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వెంక‌ట్రామిరెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

పార్టీ ప‌రువు రోడ్డున ప‌డుతుంద‌ని గ్ర‌హించిన ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగారు. ఇరువ‌ర్గాల‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.