సోషల్ మీడియాలో తన భార్యను కామెంట్ చేశాడని యువకుడిని చితకబాదిన కలెక్టర్..

0

సోషల్ మీడియాలో తన భార్యపై కామెంట్ చేశాడని యువకుడిని చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అలీపుర్ దౌర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న నిఖిల్ నిర్మల్ భార్యపై ఒక యువకుడు సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ కామెంట్ వ్యవహారం రచ్చ రచ్చ అవడంతో కామెంట్ చేసిన యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితక బాదాడు కలెక్టర్.తన భార్యపై కామెంట్ చెయ్యమని ఎవరు చెప్పారో చెప్పమంటూ యువకుడిపై పిడి గుద్దులు కురిపించాడు. ఈ తతంగాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీన్ని సిరియస్ గా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతడిని పది రోజులు సెలవులపై వెళ్ళమని తెలిపింది..