“మోనోహర్ పారికర్” లా పరిపాలించలేను.. గోవా కొత్త సీఎం.

0

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్థానంలో ప్రమోద్ సావంత్ బాధ్యతలు స్వీకరించారు. మర్చి 18 అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోవా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 17 సాయంత్రం పారికర్ మరణించగా, 18 సాయంత్రం అంత్యక్రియలు ముగిసిన ముగిసాయి. అనంతరం బీజేపీ నాయకులు కీలకమైన భాగస్వామ్య పార్టీలతో చర్చలు సాగించినా ఫలితం లేకపోవడంతో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు.

ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిస్తామని షా చెప్పడంతో భాగస్వామ్య పార్టీలు దారిలోకి వచ్చాయి. ఆ వెంటనే ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం ఖరారైపోయింది. ఆయన క్యాబినెట్ లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సహా 12 మంది మంత్రులకు స్థానం లభించింది. ఎంజీపీకి చెందిన సుదిన్ ధావలికర్, గోవా ఫార్వార్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లకు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి.

ఈ సందర్బంగా అనంతరం ప్రమోద్ మాట్లాడుతూ నేను “మనోహర్ పారికర్” మాదిరిగా పరిపాలించలేను. అయితే, సుపరిపాలన అందించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను” అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో గోవా రాజకీయాలను చక్కదిద్దడం కొంచం కష్టతరం అయింది .. ఈ దశలో గోవా లో అధికారం కోల్పోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి అమిత్ షా తన చాకచక్యంతో బీజేపీని అధికారంలో నిలబెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.