సునీల్” ను చంపేసిన యూట్యూబ్ ఛాన‌ల్స్

5

ఈ రోజుల్లో వ్యూస్, లైకులు, స‌బ్ స్క్రైబ‌ర్స్ కోసం యూట్యూబ్ ఛాన‌ల్స్ క్రియేట‌ర్స్ దిగ‌జారిపోతున్నారు. ఏం చేసైనా స‌రే.. వాళ్ల‌కు క్లిక్స్ వ‌స్తే చాలు అనుకుంటున్నారు వాళ్లు. అందుకే ఎంత‌కు దిగ‌జార‌డానికైనా సిద్ధ‌మే అంటున్నారు. దానికోసం నైతిక విలువ‌లను కూడా తుంగ‌లో తొక్కేస్తున్నారు. ఇటీవ‌ల పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అందులో తెలుగు ఇండ‌స్ట్రీ బుల్లితెర న‌టుడు నందం సునీల్ మ‌ర‌ణించాడు. దాన్ని త‌మ లాభం కోసం కొంద‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాసేసి యూ ట్యూబ్ ఛానెల్లో ప్ర‌మోట్ చేసుకున్నారు.

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు అంటూ రాసేసరికి అంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అదేంటి.. సునీల్ చ‌నిపోవ‌డం ఏంటి.. అత‌డికి యాక్సిడెంట్ కావ‌డం ఏంటి అంటూ అంతా కంగారు ప‌డ్డారు. తీరా అస‌లు విష‌యం తెలిసి.. అలా రాసిన వాళ్ల‌ను.. ఛానెల్ తీరును చూసి బండ బూతులు తిడుతున్నారు అభిమానులు. అస‌లు విష‌యం తెలుసుకుని సునీల్ కూడా వెంట‌నే త‌న ట్విట్ట‌ర్లో మ్యాట‌ర్ షేర్ చేసి.. ఇలాంటి అబ‌ద్ధ‌పు వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మ‌కండి అంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి వార్త‌లు రాసి..లేనిపోని భ‌యాలు పుట్టించొద్దంటూ కోరుకున్నాడు.