1బీ, హిస్టరీ, బోటనీ పరీక్షలు రద్దు.. ఆందోళనలో ఇంటర్ విద్యార్థులు

66

పబ్లిక్ పరీక్షలంటనే విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. కొన్ని నెలల ముందు నుంచి కష్టపడి చదువుకుని అన్నీ గుర్తు పెట్టుకుని మూడు గంటల్లో సమాధానాలు రాస్తుంటారు. ఇది వాళ్ల ప్రతిభకు, కష్టానికి పరీక్ష. ఇటీవల కాలంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు అధికమయ్యాయి. దీంతో కష్టపడి చదివే విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.  ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో మరో వార్త ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంటర్మీడియట్ 1బీ, హిస్టరీ, బోటనీ పరీక్షలను రద్దు చేసినట్లు పోస్టింగ్ ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే డీఈఓ ఆదేశాల మేరకు.. మళ్లీ 15వ తేదీని పరీక్ష నిర్వహించనున్నారని, ఈ వార్తను అందరికి షేర్ చేయాల్సిందిగా అందులో ఉంది. దీంతో ఆ వార్త ఇప్పుడు వైరల్ మారింది. కాని ఇది అంతా ఫేక్ అని, ఇటువంటి వాటిని విద్యార్థులు నమ్మి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లాకు సంబంధించి ఆర్ఐఓ, డీవీఈఓ మాత్రమే చూస్తారని డీఈఓకు ఎలాంటి సంబంధం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.