నేను మా అమ్మకు సగం లివర్ దానం చేశాను.. పెళ్లి తరువాత సమస్యలేమైనా వస్తాయా..?

125
I've donated half a lever to my mother, Any problems after marriage?
I've donated half a lever to my mother, Any problems after marriage?

హలో డాక్టర్ … నా పేరు భార్గవి నావయస్సు 19 సంవత్సరాలు. నేను మా అమ్మకు లివర్ దానం చేశాను.. మా అమ్మ కూడా ఈ మధ్యనే చనిపోయారు.. కాగా ఇంట్లో పెళ్లి సంబందాలు చేస్తున్నారు.. నా ఫ్రెండ్ ని అడిగితే పెళ్లి తరువాత సెక్స్ సంబందించిన సమస్యలు , లేదా పిల్లల్లో ఆలోపం ఖచ్చితంగా కని పిస్తుందని అన్నాది. నాకు కాస్త భయంగా ఉంది.. సలహా ఏమైనా చెప్పగలరా…?

ముందుగా మీకు ధన్యవాదములు.. మీరు మీతల్లికి మీ లివర్ ని ఇచ్చినందుకు.. సహజంగా లివర్ అనేది కణాలు వాటంతట అవి పేరుగుతూనే ఉంటాయి.. అందు వలన మీరు భయపడాల్సిన అవసరం లేదు.. కణాలు విభజన చెంది వాటంతట అవి కాలేయానన్ని మళ్లీ మాములు స్థితికి తీసుకు వస్తాయి.. కాబట్టి మీరు పెళ్లి తరువాత ఎలాంటి ప్రమాదం ఉండదు.. అపోహలు లేకుండా మీరు సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు.. శృంగారం గురించి, పిల్లల గురించి అనవసరంగా ఆలోచించి కంగారు పడాల్సిన పని లేదు. లివర్ డొనేషన్‌కి, మీ సందేహాలకు సంబంధమే లేదు. కాబట్టి మీరు వివాహం చేసుకుని, అందరిలానే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు. మీ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు..