రష్మీ అందం చూసి ఫిదా అయ్యారు.. ఒక్క టచ్ అంటూ ఎగబడ్డారు

114

బుల్లి తెరపై తన అందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్న యాంకర్ రష్మీ. జబర్దస్త్ షో లో యాంకర్ గా, అటు సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈ అమ్మడు ఈ మధ్య షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడంలో బిజీగా ఉంది. ఈ సందర్బంగా అనంతపురంలో తళుక్కుమంది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి వెళ్లిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

కాగా, రష్మీతో సెల్ఫీలు దిగడానికి, కరచాలనం చేయడానికి అభిమానులు పోటీపడ్డారు. ఆమెపై పూలు చల్లుతూ మురిసిపోయారు. షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేసిన రష్మీ, దీపము వెలిగించింది. షాప్ లో ఉన్న అన్నిటిని చూపించి ప్రజలకు అందుబాటు ధరలో ఉన్నాయి అంటూ రష్మీ అన్నారు. అనంతరం షాపింగ్ మాల్ లో దీపాన్ని వెలిగించిన రష్మీ అనంతరం కొందరితో సెల్ఫీలకు పోజులిచ్చింది.

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ కొన్ని సినిమాల్లోనూ నటించి క్రేజ్ తెచ్చుకుంది. అందుకే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం ఆమెను వ్యాపారులు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే వైజాగ్, విజయనగరం వంటి ప్రాంతాల్లోనూ ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఇప్పుడు అనంతపురం లో కూడా సందడి చేసింది.