జానా, ఉత్తమ్‌కి రామోజీ షాక్‌ ఇస్తున్నాడా…?

442
Jana, uttam, Ramoji Shock is giving ..
Jana, uttam, Ramoji Shock is giving ..

తెలంగాణ కాంగ్రెస్‌కి కేరాఫ్‌ అంటే ఈ ఇద్దరు నేతలే.. ఒకరు సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత జానా రెడ్డి. మరొకరు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఇద్దరూ పాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలే. కాంగ్రెస్‌ గెలిస్తే ఈ ఇద్దరు నేతలు సీఎం రేస్‌లో ముందున్నారు. అలాంటి నేతలకు సడెన్‌గా ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు నుంచి షాక్‌ తగిలిందట.

సీఎం రేస్‌లో ముందున్న ఈ ఇద్దరు నేతలను కాదని, రామోజీరావు కాంగ్రెస్‌ తరఫున మరో బడా నేతను లైన్‌లో పెడుతున్నారని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని సూచించింది, రామోజీ చిరకాల మిత్రుడు అయిన ఆ నేతను సీఎమ్‌ను చేయడానికే అట. ఆయన ఎవరో కాదు.. జైపాల్‌ రెడ్డి అని చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం అని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

జైపాల్‌రెడ్డి – రామోజీకి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. జైపాల్‌ రెడ్డి జీవితాశయం ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని అట. రాష్ట్రం విభజించబడినా, తెలంగాణకు అయినా సీఎం కావాలని ఆయన భావిస్తున్నాడట. రామోజీతో భేటీ అయి తన చిరకాల వాంఛను ముందు పెట్టడంతో, జైపాల్‌కి మద్దతు ఇవ్వడానికి రామోజీ ఓకే అన్నాడట. ఆ తర్వాత చంద్రబాబుతో పావులు కదిపినట్లు కాంగ్రెస్‌ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటు జానా, అటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి తెలియడంతో వారు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. రామోజీతో డైరెక్ట్‌గా ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. ఇటు, ఏపీ నేత చంద్రబాబుకి సైతం చెక్‌ పెట్టేందుకు పార్టీలో తిరుగుబాటు లేవదీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఏం జరగనుందనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం కోసం ఇలాంటి కుర్చీలాటే ఉంటుందని, సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రులు వస్తారని పలువురు రాజకీయ పండితులు చర్చించుకోవడం ఆసక్తిగా మారుతోంది.