పవన్ కల్యాణ్ గారు మీకు సరైంది కాదు.. మీరు చేస్తోంది తప్పు : నటి మాధవీలత

504
pawan kalyan fans actor bjp leader madhavi latha
pawan kalyan fans actor bjp leader madhavi latha

ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజా శక్తిగా ఎదుగుతున్న పార్టీ జనసేన పార్టీ అని అలాంటి పార్టీ మీద ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సూచించారు.. ఇది తనసలహా మాత్రమే అని తనని అభిమానించే వారిలో తను కూడా ఒక్కరన్న విషయం అందరికి తెలుసు కాబట్టే తను జనసేనానినికి ఈ సలహా ఇస్తున్నానని అన్నారు.. తాను జనసేన పార్టీ పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న ప్రతి మీటింగ్ కూడా వింటున్నానని అందులో ఎక్కువ శాతం మీటింగ్స్ లో పవన్ కల్యాణ్ తప్ప, వేరే వాళ్లెవరైనా మాట్లాడారా అని తనని చాలా మంది ప్రశ్నించారని అందుకే తనకు ఎదురైన ప్రశ్నను పవన్ కల్యాణ్ గారి ముందుకు తీసుకు రావటం లో తన చిన్న ప్రయత్నం మాత్రమే ఇది అని ఆమె పేర్కొన్నారు.. “ఆవిడ మాటల్లోనే” తను ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సారాంశం.. ఇదే

అయ్యా ఇది విమర్శ కాదు సలహా మాత్రమే
జనసేన మీటింగ్స్ అన్ని ఫాలో అవుతున్న ఒక్క మీటింగ్ లో కూడా వేరేవాళ్లు మాట్లాడారా??2 గంటలు 4 గంటలు కళ్యాణ్ గారి మాటలే న పక్కన మహిళలు డమ్మి గ ఉండటం ఏంటి?? ఎక్కడో ఎపుడో అలా అలా మాట్లాడి వెళ్తున్నారు స్టేజి మీద మొదట నాయకుడి స్పీచ్ ఉండదు కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇంకా మాట్లాడే వారే లేదా?? ఇంకా పోతే ఆయన్ని కలవాలి అంటే జనసేన ఆఫీస్ దగ్గర వెయిటింగ్ వెయిటింగ్ అంట ఇది సీనియర్ జర్నలిస్ట్స్ లు ఆయన్ని అభిమానించే వాళ్ళు అసహనానికి గురై బాధ తో చెప్పిన మాటలు . సీఎం తో ఎలా కలవాలి సోర్స్ ఈజీ ఉంది . పీఎం ని కలిసే విధానం క్లియర్ గ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసే మార్గం అర్ధం అవట్లేదు లేదు అని సమాచారం ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని గమనించాలి … అధికారం లోకి వస్తే ఏమి చేస్తాము క్లారిటీ ఉండటం లేదు స్పీచెస్ లో . ఎంతసేపు పక్క పార్టీ లని విమర్శించమే ఎందుకో సరి ఐన విధానం కాదు మనమేంటి మనం ఎం చేస్తాం విధులు విధానాలు చెప్పాలి. ద్వేషాలని రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయం . మార్పు కావాలని వచ్చిన వారు కూడా అదే పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు నాకు . ఇది నా అభిప్రాయం.. అని పోస్టు చేసింది.. కాగా దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది..