సీఐ మాధవ్ నా చుట్టూ ఎన్ని ప్రదక్షణలు చేశాడో ఆయనకే తెలుసు.. జేసీ

0

గత వారం రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీనపంలోని ప్రబోధానంద స్వామి ఆశ్రమ వివాదంలో పోలీసులను సంఘటన స్థలంకు చేరుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడుతూ.. ‘కోజ్జా’ ల్లా ఉన్నారెంటి అనటం ఇప్పసుడు వివాదాంశం గా మారింది. ఈ మాటలను ఖండిస్తూ సీఐ మాధవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే… కాగా ఇప్పుడు ఈ అంశం జేసీ వర్సెస్ పోలీసులుగా మారంది.

ఈ ఉదయం సీఐ మాధవ్ మాట్లాడుతూ పోలీసులను ఎవరన్నా ఏమన్నా అంటే నాలుక కోస్తా అని హెచ్చరించిన విషయం తెలిసిందే కాగా దీనిపై స్పందించిన జేసీ నేను ఎవరినో ఒక్కరిని కాదుగా అన్నది నీవు కొజ్జా అని అన్నాడు.. అంతే కాకుండా అది తప్పు అయితే నేను పోలీసుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతానని జేసీ అన్నారు..

ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద అల్లర్లు జరుగుతుంటే… అంత మంది పోలీసులు వుండి, వారి వద్ద అయుధాలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని జేసీ విమర్శించారు. ఇక మాధవ్ తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాడో అది ఆ మాధవ్ కే తెలుసని జేసీ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మీసాలు తిప్పాడని…. ఆడ, మగ కాని వాళ్లకు కూడా మీసాలు ఉంటాయని మాధవ్ ని జేసీ ఎద్దేవా చేశారు.