శాతవాహన యూనివర్సిటీకి భూ గండం

10

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు హద్దులు ఏర్పాటు చేస్తున్నారు కబ్జా దారులు.. రాను రాను కబ్జా దారుల అకృత్యాలు అధికమై పోతున్నాయి. ఇంత కాలం అడవులు ప్రభుత్వ భూములకే పరిమితమైన కబ్జా దారుల కన్ను విశ్వవిద్యాలయ భూములపై పడుతుంది. గతంలో ఉస్మానియా భూములను కబ్జా చేసేందుకు కొందరు విఫలయత్నం చేశారు.

విద్యార్థులు గట్టిగా ఎదురు తిరిగి ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించుకోగలిగారు. ఇక తాజాగా శాతవాహన విశ్వవిద్యాల భూములపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. ఖాళీ స్థలంలో హద్దులు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీ భూములను తమ వశం చేస్తుకుంటున్నారు. దీనిపై ఏబీవీపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏబీవీపీ నాయకులూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీకి కింద 42.14 ఎనకరా భూమి ఉందని, దీనిపై కొందరి కన్ను పడిందని అన్నారు. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నింస్తున్నారని వారు తెలిపారు. అడ్డు చెప్పాల్సిన యూనివర్సిటీలోని కొందరు వారికీ సహకరిస్తున్నారని వారు తెలిపారు.

వెంటనే శాతవాహన యూనివర్సిటీ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలని వారు కోరారు.