పుట్టిన రోజున అవయవ దానం చేసిన కళ్యాణ్ దేవ్

0

మెగాస్టార్ చిన్న అల్లుడిగా విజేత చిత్రం తో హీరో గా పరిచయమయ్యాడు కళ్యాణ్ దేవ్. ఈ చిత్రం ఆశించిన ఫలితం అందివ్వలేకపోయిన కళ్యాణ్ దేవ్ కి నటన లో మంచి మార్కులు వచ్చేలా చేసింది. అయితే ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ తన పుట్టిన రోజును అభిమానుల సమక్షం లో జరుపుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు.అనంతరం కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ. “నా అవయవాలు దానం చేయాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను .ఇలాంటి అద్భుతమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి మన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెబితే కచ్చితంగా వాళ్లు కూడా మనం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించడమే కాదు సంతోషిస్తారు కూడా అని చెప్పారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పులి వాసు దర్శకత్వం లో ఒక చిత్రం చేయబోతున్నాడు.