“కన్నడ రెబల్ స్టార్” నటుడు”అంబరీష్ ” ఇకలేరు ..

34
kannada hero ambarish kannada rebal star .
kannada hero ambarish kannada rebal star .

ప్రముఖ కన్నడ సినీ నటుడు కన్నడ రెబల్ స్టార్ గా పిలిచే “అంబరీష్” మృతి చెందారు … గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగుళూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు..
మైసూర్ లోని మాండ్య జిల్లా లో దొడ్డరసినకేరెలో 1952 మే 29 న అంబరీష్ జన్మించారు అసలు పేరు “అమరనాథ్” గౌడ ..
1972 లో ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టన్నకనగల్ నిర్మించిన ” నాగారహవు ” అనే చిత్రం తో సినీరంగం లో కి అడుగు పెట్టిన ఆయన 200 సినిమాలకు పైగానే నటించి కన్నడ రెబల్ స్టార్ గా ఎదిగారు.. సినిమాల్లో నటిస్తూనే సినీనటి’ సుమలత” ను 1991 లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు .. 2013 లో కాంగ్రెస్ తరుపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి .. కేంద్ర మంత్రి గా పని చేసారు . అంబరీష్ మృతి తో కన్నడ చిత్ర పరిశ్రమ శోక సంద్రం లో మునిగిపోయింది .. కాంగ్రెస్ నేతలు నివాళుర్పించేందుకు ఆసుపత్రి కి చేరుకున్నారు ..