గ్రేటర్‌పై కేసీఆర్‌ స్కెచ్‌ అదుర్స్‌.. మహాకూటమికి చుక్కలు

183
KCR Sketch on Greater Hydrabad
KCR Sketch on Greater Hydrabad

2014 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అందని ద్రాక్షలా ఊరించింది గ్రేటర్‌ హైదరాబాద్‌. గత ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 24 స్థానాలలో కేవలం రెండు మూడింటిని మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ తర్వాత ఏడాదిన్నరకే జరిగిన జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించింది గులాబీ దండు. ఏకంగా 95 స్థానాలలో గెలుపొంది తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. తన దైన శైలిలో సోలోగా టీఆర్‌ఎస్‌ తరఫున చక్రం తిప్పి పార్టీని హైదరాబాద్‌ గల్లీ గల్లీలలో జెండా పాతేలా చేయగలిగారు కేటీఆర్‌. తండ్రి కేసీఆర్‌ వేసిన స్కెచ్‌, ఆయన అందించిన సలహాలు, సూచనలతో కేటీఆర్‌ తిరుగులేని సక్సెస్‌ను సొంతం చేసుకోగలిగారు.

ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్ మరోసారి టీఆర్‌ఎస్‌కి ముఖ్యంగా కేసీఆర్‌కి సవాల్‌ విసురుతోంది. ఈసారి గ్రేటర్‌ పరిధిలోని 24 స్థానాలలో కనీసం పదింటిని అయినా సొంతం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు గులాబీ దళపతి. ఇటు ఎమ్‌ఐఎమ్‌ మద్దతుతో భారీగా మెజారిటీలు సాధించాలనేది ఆయన తాపత్రయం. అందుకే, ఈ దఫా ఎన్నికలలో చివరి మూడు రోజులలో కేసీఆర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డికే తన ప్రచారాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారట.. ఇక్కడ సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడం, గత తన ప్రసంగాలలో జరిగిన వాటిపై వివరణ ఇవ్వడం, సీమాంధ్రులకు తమ పాలనలోనే మెరుగైన పరిపాలన అందుతుందని భరోసా ఇవ్వడమే లక్ష్యంగా సాగుతున్నారట.. ఇటు, తన రాజకీయ వారసుడు కేటీఆర్‌కి సైతం గ్రేటర్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారట..

తెలంగాణ కాంగ్రెస్‌తో టీడీపీ జట్టు కట్టిన సందర్భంలో, ఏపీలో టీడీపీకి, చంద్రబాబుకి వ్యతిరేక వర్గాలను ఏకం చేసి, ఆ సీమాంధ్రులను బూతులకు రప్పించి ఓటు వేయిస్తే చాలని, తమకు మెజారిటీలు రాకపోయినా, విజయం తధ్యం అని భావిస్తున్నారట గులాబీ నేతలు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ టికెట్‌లను దక్కించుకున్న నేతలకు గతంలో టీడీపీతో సంబంధ బాంధవ్యాలు ఉండడం, సీమాంధ్ర ఓటర్లను చీల్చడంలో ఇవి వారికి ఉపయోగపడతాయని లెక్కలు కడుతున్నారట. ఇటు, గ్రేటర్‌ వైసీపీ, జనసేన నేతలలో టచ్‌లో ఉండి తమ టార్గెట్‌ని ఈజీగా చేధించాలని కేటీఆర్‌ భావిస్తున్నారట. దీనికోసం ఇప్పటికే పక్కా వ్యూహం రెడీ చేయగా, త్వరలోనే దానిని అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటారట కేటీఆర్‌. దీంతో, గ్రేటర్‌లోనూ టీఆర్‌ఎస్‌ విజయాన్ని, కారు స్పీడ్‌ని ఎవరూ ఆపలేరని అంచనా వేస్తున్నారు.