కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు.. 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. హెడ్ ఫోన్స్ రాజకీయం..

75

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగలి.. కార్నియాకు గాయమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. దీనిపై అత్యంత తీవ్రంగా వ్యవహరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరి శాసన సభ్యత్వాలను రద్దు చేయడంతో పాటు, 11 మందిని అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకూ సభ నుంచి బహిష్కరించింది. వీరిలో.. పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు.. డీకే అరుణ, మాధవ్ రెడ్డి, పద్మావతి, రామ్మోహన్రెడ్డి, జానారెడ్డి, జీవన్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వంశీచెందర్ రెడ్డి ఉన్నారు.

See also:స్వామిగౌడ్ తో కేసీఆర్ నాటకాలు ...కార్యకర్త లేఖ

అలాగే మండలిలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీలను.. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోధర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత తొలుత 11 మంది సభ్యులను ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు, అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీర్మానాన్ని సభ ముందుంచారు. ఈ రెండు తీర్మానాలనూ సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

Kommitla Samapanth Suspension

తాను హెడ్ ఫోన్స్ ను ఎవరి టార్గెట్ గానో విసరలేదని, తాను విసిరిన హెడ్ ఫోన్స్ స్వామిగౌడ్ కు తగిలినట్టు సాక్ష్యం చూపితే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించినా, టీఆర్ఎస్ పట్టించుకోలేదు. స్వామిగౌడ్ కు హెడ్ ఫోన్స్ తగులుతున్న దృశ్యాలు ఎక్కడా విడుదల కాలేదు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ, సభ సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. తాను గవర్న్ ను టార్గెట్ చేయబోతే, హెడ్ ఫోన్స్ గురితప్పి స్వామిగౌడ్ ను తగిలాయని కోమటిరెడ్డి చెప్పడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ఇటువంటి వ్యక్తులు సభలో ఉండాల్సిన అవసరం లేదని, ఇలాంటి అరాచ శక్తులను సభలోపలా.. భయట సహించే ప్రసక్తే లేదనన్నారు.