కేటీఆర్ – బండ్ల గణేశ్ చాట్ … సోషల్ మీడియాలో వైరల్…!

711
ktr, bandla ganesh whats up Chat ... Viral in Social Media ...!
ktr, bandla ganesh whats up Chat ... Viral in Social Media ...!

తెలంగాణ ఎన్నిలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది మరింత ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పవచ్చు.. ప్రస్తులం సోషల్ మీడియాలో రాజకీయ నేతల మధ్య జరుగుతున్న వ్యక్తిగత చాటింగ్ని మీడియా ముందు ఉంచుతున్నారు… నిన్న లగడపాటి సర్వే వివరాలు వెల్లడించిన తరువాత కేటీఆర్ స్పందిస్తూ లగడపాటితో వాట్స్ యాప్ లో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లు చూపించి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అనంతరం లగడపాటి మీడియా ముందుకు వచ్చి తన స్మార్ట్ ఫోన్ లోని కేటీఆర్ చాటింగ్ వివరాలను, ఫోన్ నంబర్లను బయటపెట్టారు.. కాగా తాజాగా సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కేటీఆర్ తో తాను చేసిన చాటింగ్ ని బయట పెట్టారు..

కేటీఆర్ బండ్ల గణేశ్ మధ్య చాటింగ్ ఇలా సాగింది..

ఈ సంభాషణలో “అంతా ఓకే. నేను ప్రజల్లో నిత్యమూ తిరుగుతూ అలసిపోయా” అని కేటీఆర్ అంటే “నేను ఊహించగలను. ఎన్నికలపై నేను వింటున్నది నిజమేనా? క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలావుంది? నీ గురించే ఆలోచిస్తున్నాను సోదరా. నువ్వు కష్టపడుతున్నావ్” అని బండ్ల గణేష్ అన్నట్టు ఉంది. ఆపై కేటీఆర్ స్పందిస్తూ, “అవును… ఇవి రాజకీయాలు. పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. మా అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. మా సర్వేలో మెరుపులు లేవు. నాన్న సరిగ్గా పనిచేయట్లేదు. ఇది నాకు పిచ్చి పుట్టిస్తోంది. మేము గెలవకుంటే, నేను యూఎస్ వెళ్లిపోతానేమో. ప్రతిపక్షంలో మాత్రం కూర్చోలేను” అని కేటీఆర్ అన్నారు. దీనిపై బండ్ల స్పందిస్తూ, “అంతా మేలే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో అంతా అయిపోతుంది. వెయిట్ అండ్ సీ. తీరిక చూసుకుని నాకు ఫోన్ చెయ్యి” అనగా కేటీఆర్ సరేనన్నారు. ఈ వాట్స్ యాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.