చంద్రబాబు ఎల్లో మీడియాలో వస్తున్నాడు.. ప్రజలు ఆ మాయలో పడోద్దు.. : కేటీఆర్

74

టీఆర్ఎస్ యువ నేత తెలంగాణ ఎన్నికలు మరో రెండు రోజులు వుండటంలో చంద్రబాబు తన ఎల్లో మీడియాతో ప్రజలను కుటమి మాయలో పడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మాయలో తెలంగాణ ప్రజలు పడొద్దని కేటీఆర్ సూచించారు.. అనంతరం కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు జర్మనీ నియంత హిట్లర్ అనుచరుడు గోబెల్స్ కు తమ్ముడని విమర్శించారు.

పోలింగ్ తేది సమీపిస్తుండటంతో చంద్రబాబు ఆదేశాలతో ఆయన అనుచరులు, మద్దతుదారులు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు పెంపుడు కుక్కల్లా ఉన్నా మీడియా సంస్థలు, సోషల్ మీడియా సాయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, ఆ మాయలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కేటీఆర్ తన ట్వీట్టర్ లో ప్రజలను కోరారు..