కేటీఆర్ నువ్వో పిల్ల కాకివి.. హరీష్ రావు నీ రాజకీయ వారసుడని చెప్పగలవా.. : రేవూరి

92
ktr,kcr,harish roa, telangana, trs, tdp revuri

హనుమకొండ లోని ఉమ్మడి జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంతో రేవూరి మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ నేత కేటీఆర్ పై విమర్శలు చేశారు.. అనంతరం తెలంగాణ సీఎం కేసీర్ గారు హరీష్ రావును తన రాజకీయ వారసుడని ప్రకటిస్తే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు…నిన్న మొన్న తెలంగాణకు వచ్చి మంత్రి  కేటీఆర్ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడని మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన  అన్నారు. అనంతరం కేటీఆర్ ఇక్కడ సదువు కోలేదని 2008 వరకు అమెరికాలో చదువు కొని అక్కడ ఉద్యోగం చేసి ఉద్యమంలో ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్నావని.. అసలు నీకు చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు..

revuri
revuri

 

1995లో జరిగిన పరిణామాలు కనీసం నీకు ఊహకుకూడా తెలిసి ఉండదు పిల్ల కాకివి నీవు వయసుతో సంబందం లేకుండా మాట్లాడుతున్నావని ముందు చరిత్ర తెలుసు కోవాలని సూచించారు. చరిత్రను వక్రీకరించే విధంగా నీవు మాట్లాడడం మంచి సంస్కృతి కాదని అన్నారు.. అమెరికాలో చదివి ఉద్యోగం చేసి నీవు నేర్చిన సంస్కృతి ఇదేనా అని రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

1995లో జరిగిన పరిణామం ఏమిటో నీ అయ్య కెసిఆర్‌ను అడుగు ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు  వెన్నుపోటు పొడిచాడు అంటున్న నీవు ముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడు అలా అయితే మొదలు నీ అయ్యా  కెసిఆరే వెన్నుపోటుదారుడని, దానికి ప్రత్యక్ష సాక్షము  మేమే అని అన్నారు. ఆ రోజు డిసిసిబి డిసిఎంఎస్ ఎన్నికల సందర్భంగా అన్నగారి ఆదేశాలకు విరుద్ధంగామెదక్ జిల్లాలో నీ అయ్య కేసీఆర్ ఆదిలాబాద్ లో నగేష్ వరంగల్‌లో కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్‌రావు నల్లగొండలో ఎలిమినేటి మాధవరెడ్డి గారు వ్యవహరిస్తే ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి సూచన మేరకు సస్పెండ్ చేసే సమయంలో వారు భయపడి వైజాగులో ఉన్న నాటి రెవెన్యూ శాఖ మంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారే  వారు మొరపెట్టుకుంటే లక్ష్మీ పార్వతితో విభేదించి రక్షించారని ఇవన్నీ నీకు తెలియవని అనవసరంగా నీ ఇష్టం వచ్చినట్లు సభల్లో మాట్లాడితే చూస్తు ఉండేది లేదని హెచ్చరించారు..

revuri
revuri

1200మంది అమరుల బలిదానాలతో వచ్చిన తెలంగాణను  ఐదుగురు కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవిస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచింది కెసిఆర్  నాలుగు కోట్ల ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేసిన వెన్నుపోటు దారులు మీరేనని ప్రకాష్ రెడ్డి అన్నారు

దళితుడిని తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి కెసిఆర్ మోసం చేశారని ఇప్పుడు మంత్రి హరీష్‌రావును సైతం అదే తరహాలో మోసం చేస్తున్నారని ఆరోపించారు  మంత్రి కెటిఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని అన్ని ప్రభుత్వ శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం కేటీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉంటే హరీష్‌రావు టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని కెటిఆర్‌ను కాకుండా హరీష్ రావును రాజకీయ వారసుడిగా ప్రకటించే దమ్ము ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు..