మూడు రాజధానులపై లగడపాటి సర్వే

1212
lagadapati rajgopal survey on 3 capitals

ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే చేశారు. తెలంగాణ, ఆంధ్ర విషయంలో తన సర్వేలు నెగెటివ్ గా రావటంతో మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. ఏపీ రాజధానులపై సర్వే పేరుతో అభిప్రాయసేకరణ చేశారు. 15 రోజులు.. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఈ రిజల్ట్ ను మీడియా పరంగా వెల్లడించటానికి వెనకాడుతున్నారు. అయితే జూబ్సిహీల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన మిత్రులు, శ్రేయోభిలాషుల దగ్గర మాత్రం సర్వే ఫలితాలను వెల్లడించారంట. జిల్లాల వారీగా కూడా చెప్పారంట. సుదీర్ఘంగా సాగిన ఆ చర్చలోని సారాంశం ఇలా ఉంది.

ఏపీలో మూడు రాజధానులపై జిల్లాల వారీ వివరాలలు అనుకూలం, వ్యతిరేకంగా శాతాలు ఇలా ఉన్నాయి.
1. కృష్ణాజిల్లాలో అనుకూలంగా 42 శాతం వస్తే.. వ్యతిరేకంగా 51 శాతంగా ఉంది. చెప్పలేం అనేవారు 7శాతంగా ఉన్నారంట.
2. గుంటూరు జిల్లాలో అనుకూలంగా 47శాతం వస్తే.. వ్యతిరేకంగా 53 శాతం మంది ఉన్నారంట.
(గుంటూరు జిల్లాలోని పల్నాడు ఏరియా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు ఉండటం విశేషం)
3. ప్రకాశం జిల్లాలో మూడు రాజధానులకు 58 శాతం మంది అనుకూలంగా ఉంటే.. వ్యతిరేకంగా 40శాతం మంది ఉన్నారు. చెప్పలేం అనే వారి శాతం 2శాతంగా ఉంది.
4. నెల్లూరు జిల్లాలో మూడు రాజధానులకు అనుకూలంగా 62శాతం మంది ఓకే అంటే.. వ్యతిరేకంగా 32శాతం మాత్రమే ఉన్నారు. చెప్పలేం అనే వారి శాతం 6 శాతంగా ఉంది.
5. కర్నూలు జిల్లాలో మూడు రాజధానులకు అనుకూలం అని 68శాతం అంటే.. వ్యతిరేకంగా 32శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు.
(హైకోర్టులో కర్నూలులో ఉండాలనే డిమాండ్ బలంగా వ్యక్తం చేశారు. రాజధాని అంశం కంటే హైకోర్టుపైనే తన అభిప్రాయాన్ని బలంగా చెప్పటం విశేషం)
6. కడప జిల్లాలో అయితే 73శాతం మంది మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే.. వ్యతిరేకంగా కేవలం 27శాతం మంది మాత్రమే చెప్పారు.
(రాజధాని ఎక్కడైనా పర్వాలేదు. ఉద్యోగం, ఉపాధి అనేది ముఖ్యం అని బలంగా చెప్పారు)
7. చిత్తూరు జిల్లాలో మూడు రాజధానులకు అనుకూలంగా 66శాతం మంది ఉంటే.. వ్యతిరేకంగా 32శాతం మంది ఉన్నారు. చెప్పలేం అని వారు 2శాతంగా ఉన్నారు.
(రాజధాని అంశం అనేది పెద్దగా ప్రాధాన్యత ఉన్న అంశంగా చిత్తూరు ప్రజలు భావించటం లేదంట)
8. అనంతపురం జిల్లాలో మూడు రాజధానులకు అనుకూలంగా 48శాతం మంది మాత్రమే చెబితే.. వ్యతిరేకంగా 52శాతం మంది ఉండటం విశేసం.
9. పశ్చిమగోదావరి జిల్లాలో 55శాతం మంది మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే.. వ్యతిరేకంగా మాత్రం 45శాతం మంది ఉన్నారు.
10. తూర్పుగోదావరి జిల్లాలో అనుకూలంగా 56 శాతం మంది ఉంటే.. వ్యతిరేకంగా 40శాతం మంది ఉన్నారు. చెప్పలేం అనే వారు 4శాతంగా ఉన్నారు.
11. విశాఖపట్నం జిల్లాలో మూడు రాజధానులకు 71శాతం మంది అనుకూలంగా ఉంటే.. వ్యతిరేకంగా 29శాతం మంది మాత్రమే ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్న వారిలో ఎక్కువ శాతం విశాఖపట్నం నగరం పరిధిలోని వారే కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
12. శ్రీకాకుళం జిల్లాలో మూడు రాజధానులకు అనుకూలంగా 79 శాతం మంది ఉంటే.. కేవలం 21శాతం మంది మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు.
13. విజయనగరం జిల్లాలోనూ మూడు రాజధానులకు అనుకూలంగా 80శాతం మంది ఉంటే.. వ్యతిరేకంగా కేవలం 20శాతం మంది మాత్రమే ఉన్నారు.

ఈ వివరాలను ఆప్తుల దగ్గర వెల్లడించారంట లగడపాటి రాజగోపాల్. నిజమో అబద్దామో తెలియదు.. రాజకీయ, మీడియా మిత్రుడు చెప్పాడు కాబట్టి నమ్మాలి అంతే…