వివాదంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” … రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు

0

వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం ” లక్ష్మీస్ ఎన్టీఆర్” ఈ చిత్రం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కోన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న వెన్ను పోటు అనే పాటను విడుదల చేశారు.. ఈ పాట ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువైంది.. ఈ పాటలో ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ పార్వతి ఫోటోలతో విడుదల చేయడం తో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వర్మ తమ నాయకుడు చంద్రబాబు గారిని కించ పరిచారని ఆరోపిస్తు పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదు చేశారు.

కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి రెండవ పట్టణ పోలీస్ ప్టేషన్ లో రామ్ గోపాల్ వర్మతో పాటు, నటీ నటుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… వెన్ను పోటు పాటలో తమ నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచితంగా చూపించారని మండిపడ్డారు.. చంద్రబాబు ఫొటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు.

వర్మ ఒక్కడే ఈ పని చేయడం లేదని ఆయన వెనుకుండి కొందరు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని దమ్ముంటే చంద్రబాబు ముందుకు వచ్చి ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.. కర్నూలు ఒక్కటే కాదని రాష్ట్రం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ లలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వర్మ సినిమా తీసుకోవచ్చు కానీ టీడీపీ పార్టీ ప్రతిష్ట నాయకులను అవమాన పరిచే విధంగా ఉంటే మాత్రం సినిమాను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.. మరి ఈ వివాదం పై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..