హుందాతనం అంటే ఇదేనా…? చంద్రబాబుకు సామాన్యుడి లేఖ

0

నిన్న మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత పై దాడి జరిగితే అర్ధ రాత్రి11.30 గంటలకు మీటింగ్ పెట్టి నీవు చేపట్టిన పదవుల గురించి మాట్లాడు తావా అంటూ చేడుగుడు ఆడుకున్నాడు.. కాగా ప్రస్తుతం తను చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..

రాజు అంటే విచక్షణా జ్ఞానం ఉండాలని, రాజుకు సమయ స్పూర్తితో పాటు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉండాలని, జనం కోసం చెమటను చిందిస్తూ… వ్య‌క్తి.. ర‌క్తాన్ని చిందించాల్సి వ‌స్తే.. ఆ దేశ రాజు వెంట‌నే మేల్కోవాలి. కానీ తాఫీగా ఎప్పోడో అందరు నిద్ర పోయే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా నీవు నీ రాజకీయ జీవితం గురించి ప్రస్థావించటం.. మీకు తగునా అని ప్రశ్నించారు.. నిందితున్ని అదుపులోకి తీసున్న పోలీసుల నుంచి సమాచారం తెలుసుకొని ప్రజలకు చెప్పాల్సింది పోయి.. జగన్ పై జరిగిన సంఘటన ధారుణం అని ఖండించడాన్ని తప్పు బడుతూ.. నీ రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా చూశానని నవ్వటం ఎంతవరకు మంచింది.. పైగా ఎప్సపుడో ఏదో ఎవరో చెప్పారని జరిగిన ఘటను ” ఆపరేషన్ గరుడ” నే కారణం అని చెబుతావా అంటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. జ‌గ‌న్‌కు సానుభూతి తెలియ‌జేస్తారేమో అని ఆశ‌గా ఎదురుచూశాను కానీ అది పక్కన పెట్టి మరీ ఇదంతా కుట్ర అని చెప్పటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.. జీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నార‌ని ఎవ‌రో ఒక విలేక‌రి అంటే.. ఆయ‌న‌పై సీఎం అమాంతం క‌న్నెర్ర‌జేశారు. అస‌లు మీరు విలేక‌రులేనా అని గ‌ద్దించారు. జీవీఎల్‌పై ఎందుకు ఎదురుదాడి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ విలేక‌రుల స‌మావేశం చూసిన నాకు కాసేపు బుర్ర ప‌నిచేయ‌లేదు. అస‌లు ప్రెస్‌మీట్‌లో ఏం జ‌రుగుతున్న‌దో నాకు అర్థం కాలేదని వాపోయాడు..

ప్రెస్ మీట్ మెత్తం కూడా జరిగిన ఘటన గురుంచి మాట్లాడింది కేవలం “జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాము.. ఇది అతని అభిమాని సానుభూతి కొసం, ఇలా చేశాడని మాత్రమే మాట్లాడటం ధారుణం అని పేర్కొన్నాడు.. తనని అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెడుతున్నారని, తనని ఎలాగైనా సీఎం కుర్చి నుంచి దింపాలని రాష్ట్ర బయట, లోపల కుట్రలు జరుగుతున్నాయని చెప్పటం హాస్యస్పదమని అన్నాడు.. ఇంతకు జగన్ పై దాడి జరిగింది లేక చంద్రబాబు పై జరిగిందా అనే అనుమానం ఒక్క క్షణం నాకు అనిపించిందని చెప్పుకొచ్చాడు.. అనంతరం జగన్ ఇంటికెళ్లి కెళ్లి విశ్రాంతి తీసుకున్నాడని చెప్పడం మరీ విడ్డూరమని చంద్రబాబుని ఎకి పారేశాడు..

ఇక జగన్ గురించి ప్రస్థావిస్తూ.. తన పై దాడి జరిగినా కూడా విశాఖ ఎయిర్ పోర్టులో ఉండి ధర్నాలు, నిరసనలు చేయకుండా అక్కడ నుండి చిరునవ్వు నవ్వుతూ విమానం ఎక్కి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ చెయించుకున్నాడని అది రాజు లక్షణమని అన్నారు.. అతనే మౌనంగా ఉండకుండా తన పై హత్య ప్రయత్నం జరిగిందని చెప్పి ఉంటే రాష్ట్రం లో అల్లోకల్లోలాలు జరిగేవని, కానీ తను అలా చేయలేదని అన్నారు.. తను ట్రీట్ మెంట్ తీసుకున్న తరువాత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ప్రజలకు తనకు ఏమి కాలేదని చెబితూ.. దేవుడి ఆసిస్సులు, ప్రజల దీవెనలు తనకు ఉన్నాయని తెలిపాడు.. ఇక్కడ గతంలో అలిపిరి వద్ద చంద్ర బాబు ప్రయాణిసః్తున్న కారు బాంబు బ్లాస్ట్ జరిగితే అందరు ఎలా స్పందించారో మరిచిపోయి మాట్లాడు తున్నాడని ఒక్క సారి పాల సంఘటన గుర్తు చేసుకోవాలని లేఖలో తెలిపాడు.. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది..