మా ఓటు టీఆర్ఎస్ కే… సీమాంద్రా ఓటర్లు మనోగతం

1

తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావుగారు స్థాపించినప్పటి నుండి కూడా మరో జెండా మోయలేదు.. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మేమంతా తెలుగు దేశం పార్టీ వైపే ఉన్నాం. ఏనాడు కూడా ఊహించలేదు.. అన్నగారు స్థాపింిచన పార్టీ మరో మోచేతి కిందకు పోతుందని అంటున్నారు.. చేయికి ఓటు వేయాలంటే చేయి రావడంలేదని టీ టీడీపీ ఓటు బ్యాంక్ చెబుతోంది.. మరో పక్క రాష్ట్రం అడ్డగోలుగా విడగొట్టిన పార్టీతో కలిసి చంద్రబాబు ఎన్నికల్లో కేవలం కేసీఆర్ ను గద్దెదించేందుకే ప్రయత్నిస్తున్నాడని.. అసహయం కొందరు వ్యక్తం చేస్తున్నారు..

నిన్న పలుప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ తమ నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి వాతావరణం ఉందని తెలుసుకోవడానికి మీటింగ్స్ ఏర్పాటు చేశారు.. అన్నికూడా చిన్న చిన్న కూటములుగా ఏర్పడి పార్కులు, స్కూల్, కమ్యూనిటీ హాల్స్ లో నిర్వహించారు.. ఈ సమావేశానికి హాజరైన చాలా మంది పై విదంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకే ఓటేశాం.. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉంటాం. టీడీకీ – కాంగ్రెస్ పొత్తు అంటేనే ఏంటోలా ఉంది.. జీర్ణించుకోలేకపోతున్నాం అన్నారు. మేమూ తెలంగాణ బిడ్డలమే.. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం.. ఎలాంటి ఇబ్బందులు లేవు.. అయినా ఇంకా తెలంగాణ – ఆంధ్ర అనే తేడా లేదంటూ మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాంతాల వారీగా వేరు చేసి చూడొద్దని మరికొందరు కోరారు.

గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన టీడీపీ తన రూటు మార్చి ఈ సారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొవడం తప్పు కాక పోతే మెమె కారు ఎక్కడం తప్పుకాదని… ఏ పార్టీ అయినా సరే ఒకసారి ఓ నిర్ణయం తీసుకునే టప్పుడు తమ కార్యకర్తలు ఎలా తీసుకుంటారో వారి మనసు ఎంటో తెలుసు కోవాలని వారు తెలిపారు.. కాగా ప్రస్తుతం ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అంటున్నారు.. మరి ఈ సారి ఎన్నికలు మాత్రం ఇక్కడే కాదు ఆంధ్ర లో కూడా ఈ ఎన్నికల పై అంచనాలు ఆధారపడుతున్నాయని చెప్పవచ్చు..