గజ్వేల్‌లో కేసీఆర్‌కి లక్ష మెజారిటీ.. ఏనీ డౌట్స్‌…!!

89
majority of KCR in Gajwela .. Anything Doubts ...
majority of KCR in Gajwela .. Anything Doubts ...

గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఓడిపోతారు.. ఈసారి ఆయనకు పింక్‌ స్లిప్‌ గ్యారంటీ.. ఇదీ కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారం.. కేవలం గత ఎన్నికలలో టీటీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాపరెడ్డి, గతంలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన నర్సారెడ్డి ఒకే పార్టీలో చేరారనే అంశమే ఇంతటి సొల్లు న్యూస్‌కి కారణం అని రాజకీయ విశ్లేషకుల మాట.

ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు, అక్కసు బాపతు విమర్శకులకు టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు. దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రేంజ్‌లో ఆన్సర్‌ ఇచ్చారు.. గజ్వేల్‌లో కేసీఆర్‌ ఈ దఫా లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని, ఆయనకు భారీ మెజారిటీ వస్తుందని, ప్రత్యర్ధులకు డిపాజిట్‌లు కూడా దక్కవని కౌంటర్‌ ఇచ్చారు.. అంతేకాదు, హరీశ్‌ రావు కేంద్రంగా వస్తున్న విమర్శలకు సైతం ఆయన రిటార్ట్‌ ఇచ్చారు.

హరీష్‌కి, తనకి ముందు కుటుంబమే ప్రధానమని, తర్వాతే రాజకీయాలని వివరించాడు. హరీష్‌ వెన్నుపోటు పొడుస్తాడనేవి రాజకీయ ఊహాగానాలే అని నిర్ద్వంద్వంగా కొట్టిపడేశాడు కేటీఆర్‌. సోనియా, రాహుల్‌ గాంధీ కలిసి వచ్చి ప్రచారం చేసినా తెలంగాణలో కేసీఆర్‌ శక్తిని ఓడించలేరని కుండబద్దలు కొట్టారు కేసీఆర్‌ తనయుడు.. టీఆర్‌ఎస్‌ కారు ఫుల్‌ జోష్‌ మీదుందని వంద సీట్లు గ్యారంటీ అని వివరించాడు కేటీఆర్‌. మొత్తమ్మీద, ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటున్న సమయంలో కేటీఆర్‌ కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో లేదు. అదే టీఆర్‌ఎస్‌కి బలం.