మందుబాబులకు షాక్ … మూడురోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్

113
telangana elections
telangana elections

ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మందుతో ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు భారీ స్థాయిలో వ్యూహరచనలు చేస్తున్నారని సమాచారం ఉండటంతోనే అటుగా నిఘా ఉంచిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.. ఓటరు నిస్వార్థంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు 7వ తేదిన జరగనున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ సందర్బంగా ఎలక్షన్ కోడ్ లో భాగంగా నేటి నుండి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిర్వహించకూడదని ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాదారులకు ఆదేశాలు జారీ చేశారు..

నేటి నుంచి మూడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత అమ్మకాలపై నిషేధం ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు.. చివరగా పోలింగ్ జరిగే డిసెంబర్ 7న సాయంత్రం 6 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. అలాగే ఫలితాలు వెలువడే డిసెంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి మరుసటిరోజు మధ్యాహ్నం వరకూ మద్యం అమ్మకాలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.