’మణికర్ణిక ట్రైలర్‘: వివాదాలు, భారీ అంచనాలు.. కదనరంగంలో కత్తిదూసిన కంగన..

0

వివాదాలు, భారీ అంచనాల మధ్య ’మణికర్ణిక‘ టీజర్ విడుదలైంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 1వ తేదీన సినిమా టీజర్ ను విడుదల చేసింది జీ స్టూడియోస్. ఝాన్సీ లక్ష్మీభాయ్ గా మణికర్ణిక పోరాట విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. కదన రంగంలో కంగన కత్తిదూసిన విధానం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 80శాతం దర్శకత్వం వహిస్తే… మిగిలిన 20శాతం బాధ్యతలను హీరోయిన్ కంగననే భుజానకెత్తుకున్నారు. మొదట పగ్గాలు చేపట్టిన క్రిష్.. అనంతరం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెల్సిందే. బాలయ్య ఎన్టీయార్ సినిమాను తెరకెక్కించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కంగన మణికర్ణిక పూర్తిచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక పక్కకత్తి తిప్పుతూనే.. మరో పక్క దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టారు. దీంతో దర్శకురాలిగా కంగన పేరే పోస్టర్ లో వేస్తారని ప్రచారం జరిగింది. కానీ…ట్రైలర్ లో క్రిష్ పేరు కన్పించింది. భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగన పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణికర్ణిక.