మిలియన్ మార్చ్ ను అడ్డుకుంటున్న ప్రభుత్వ పెద్దలు

1

గతంలో తెలంగాణ ఏర్పాటు కోరుతూ టీఆర్ఎస్ పార్టీ, టీ జెఏసి ఆధ్వర్యం లో మిలియన్ మార్చ్ జరిగింది. శాంతియుతంగా సాగాల్సిన ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ట్యాంక్ బండ్ పై గల ప్రముఖుల విగ్రహాలన్నింటిని నిరసనకారులు విరగొట్టడం అప్పట్లో సంచలనానికి దారి తీసింది.
అయితే అప్పుడు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం టీ జె ఏ సి తలపెట్టనున్న మిలియన్ మార్చ్ ను అడ్డుకుంటుంది. ఈ కార్యక్రమం జరిగితే తమ ప్రభుత్వానికే నష్టం అని ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్యాంక్ బండ్ రూట్ మొత్తాన్ని మూసివేశారు. అటు వైపు ఎవ్వరిని అనుమతించడం లేదు. ఇప్పటికే టీ జెఏసి, సీపీఐ, సీపీఎం పార్టీలకు సంబందించిన ప్రముఖ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ఎవరైనా కార్యక్రమం లో పాల్గొంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు.