హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్..

0

జనవరి 10 న బీసీ వసతి గృహంలో ఆహారం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఆహారం సరిగా పెట్టకుండా ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హాస్టల్ లో నీ కూతురో కొడుకో ఉంటె ఇలానే చేసేవాడివా అని వార్డెన్ పై మండిపడ్డాడు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేందర్ రెసిడెషియల్ హాస్టల్స్ ఒక్కప్పుడు చాలా గొప్పగా ఉండేవని అభిప్రాయపడ్డారు. హాస్టల్స్ లో విద్యార్థులు అరకొరగా ఉంటున్నారని రాజేందర్ అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.పేద విద్యార్థులను దృష్టిలో ఉచుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని అయన అన్నారు.