దైవసన్నిధానానికి ఛైర్మన్ గా మోహన్ బాబు..!

364
chiranjeevi mohan babu

ఫిల్మ్ నగర్ లోని ప్రముఖ దేవాలయం దైవసన్నిధానానికి ఛైర్మన్ గా నటుడు మోహన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం, ఆలయంలోనే చోటు చేసుకున్న ఈ కార్యక్రమానికి కంచి పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, దర్శకుడు రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, మురళీ మోహన్, చాముండేశ్వరీనాథ్ మొదలైన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దైవసన్నిధానం పాలకవర్గ సభ్యులు 12 మందితో, స్వరూపానందేంద్రస్వామి ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మోహన్ బాబు, తాను దేవుడి గుడికి ఛైర్మన్ గా ఉండాలని ఎన్నడూ కోరుకోలేదని తెలిపారు. అయితే, గత ఆరునెలలుగా సుబ్బిరామిరెడ్డి, ఈ విషయంపై పట్టుబట్టారని, ఆయన కోరిక మేరకే దైవసన్నిధానం ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నానని మోహన్ బాబు స్పష్టం చేశారు. గుడికి వచ్చే భక్తుల సౌకర్యమే పరమావధిగా పనిచేస్తానని అన్న ఆయన, తన కెరీర్లోని మరి కొన్ని అంశాల గురించి కూడా సరదాగా చెప్పుకొచ్చారు. చిరంజీవితో తన గొడవల గురించి స్పందిస్తూ, మేమిద్దరం చిలకా గోరింకల లాంటి వాళ్లం..ఎప్పుడూ అలా గొడవపడుతూనే కలిసి ఉంటాం అన్నారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తనకు చాలా సరదాగా ఉంటానని, తన తండ్రిలాంటి దాసరి, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు తనకెప్పుడూ ఉండాలని కోరుకున్నారు.