నందమూరి సుహాసినిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి.. : జగపతి బాబు

5

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి వారసురాలు సుహాసిని కి హీరో జగపతి బాబు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.. సుహాసిని నిజాయితీ కల వ్యక్తి అని ఆయన ప్రశంసించారు.. నియోజకవర్గ ప్రజలకు నిబద్ధతతో ఆమె సేవ చేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు.. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.. ప్రస్తుతం సుహాసిని ఉన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు..