జోగినపల్లి సమ్తోష్ కుమార్ పేరిట నర్సరీ

15

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ భావి తరాలకు భరోసాగా నిలుస్తుందని ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ తాడిచెర్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ఆయన మంగళవారం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ అనేది గొప్ప కార్యక్రమం. ఎవరికీ, ఎలాంటి స్వార్థం లేని ఈ కార్యక్రమం.. పర్యావరణాన్ని కాపాడుతోంది. భవిష్యత్తుకు భరోసానిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో, ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఆయన మరో ముగ్గురికి సవాలు విసిరి మొక్కలు నాటమని సూచించారు. వారిలో సిద్దయ్య కెటిపిపి సీఈ, ఎమ్మార్వో శ్రీనివాస్ తాడిచెర్ల, ఎస్సై నరేష్ కొయ్యుర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాలకు చాలా ఉపయోగకరమైనదన్నారు. సంతోష్ కుమార్ పేరుతో త్వరలో నర్సరీ ప్రారంభిస్తామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.