ఆయనంటే మోదీకి ఎందుకంత భయం.

11
rahul gandhi, narendra modhi.
rahul gandhi, narendra modhi.

ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అంటే అంత భయం ఎందుకని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. చైనా చర్యలపై మోదీ స్పందించడం లేదనీ… ఆయన బలహీన ప్రధాని అని రాహుల్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అండదండలతో రెచ్చిపోతున్న సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘జీ అంటే బలహీన మోదీకి వణుకు. భారత్‌కు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలపై ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. చైనా దౌత్యానికి దండం పెట్టారు: 1. గుజరాత్‌‌లో జీతో ఊయల ఊగారు. 2. ఢిల్లీలో జీని ఆలింగనం చేసుకున్నారు. 3. చైనాలో జీ ముందు మోకరిల్లారు..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

పుల్వామా దాడికి సూత్రధారైన జైషే చీఫ్ మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఐరాస భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనకు వీటో అధికారం ఉన్న చైనా అడ్డుకుంది. దీనిపై మార్చి 14 ఉదయం కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుతగుతూ వస్తోంది. దీంతో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి ఊయల ఊగడం వల్ల ఒరిగింది ఏమిటన్న ప్రశ్న ప్రతి భారతీయుడి మనసులోనూ మెదులుతోంది..’’ అని పేర్కొంది. ‘‘రక్తపాతానికి కారకుడైన ఓ తీవ్రవాదిని బీజేపీ మరోసారి వదిలేసింది..’’ అని ఆ పార్టీ ఆరోపించింది.

అయితే దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉగ్రవాదిని జి అని సంబోధించిన రాహుల్ గాంధీ, మోదీ చైనా అధ్యక్షుడికి బయపడుతున్నదని అనడం విడ్డురంగా ఉందని అన్నారు. ఇక మరి కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో స్పందిస్తూ ముందు రాహుల్ మాట్లాడటం నేర్చుకోవాలని తర్వాత రాజకీయాలు చేస్తే బాగుంటుందని ట్విట్టర్ లో బదులిచ్చారు.