బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత.

17
congress seniour leader tam vadakkam join in bjp party.
congress seniour leader tam vadakkam join in bjp party.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టామ్ వడక్కమ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. మార్చి 14 న న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో అయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా అయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు దేశ రక్షణ దళాలపైన నమ్మకం లేదని, వారు చేసిన దాడులపై ఆధారాలు చూపమంటూ కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అది నచ్చకే తాను బీజేపీలో చేరానని తెలిపారు.

వడక్కమ్, కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు. కాగా తాజా వాయుసేన చేసిన దాడులపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తీరు తనను విస్మయానికి గురిచేయడంతో పార్టీలో ఇమడలేక బయటికి వచ్చానని అయన తెలిపారు. ‘‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దేశంపై దాడులు చేస్తుంటే, దానికి భారత మిలిటరీ తగిన సమాధానం చెబితే కాంగ్రెస్ పార్టీ వాటిపై ప్రశ్నలు వేసిందని ఇలాంటి పార్టీని వీడడంలో తప్పేం లేదని అన్నారు. అంతే కాకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న నరేంద్ర మోదీ గారి కృషిని చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.