పవన్ కల్యాణ్ నెల్లూరు పర్యటన ఖరారు.. ఎవరితో రొట్టె మార్చుకోనున్నారో తెలుసా..?

0

   జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా జిల్లా పర్యటన ఖరారైంది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన, నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండగలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 23న పవన్ కల్యాణ్ తన స్నేహితుడు, నటుడు ఆలీతో కలిసి నెల్లూరు వెళ్లనున్నారు. ఆ రోజు బారా  షహీద్ దర్గాను సందర్శించి, ప్రార్థనలు చేయనున్నారు. స్వర్ణాల చెరువులో ఆలీ తో రొట్టను మార్చుకోనున్నారు. మళ్లీ అదే రోజు పవన్ తిరుగు ప్రయాణంకానున్నారు. పవన్ రాక సందర్భంగా నెల్లూరు జిల్లాలో రాజకీయ సందడినెలకొంది. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఆశవహులందరూ ఆయనను కలిసిందుకు సిద్ధమవుతున్నారు. అలాగే జిల్లాలోని పార్టీ పరిస్థితిపై పవన్ ఆరా తీయనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి సారిగా నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు పవన్.

పవన్ పర్యటనకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో  రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్), జిల్లా సమన్వయకర్తలు, సంయుక్త సమన్వయ కర్తలతో పవన్ కల్యాణ్‌ చర్చించి ప్రణాళిక ఖరారు చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన ముగియగానే  ఈ నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన మొదలు కానుంది. జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్‌ పర్యటిస్తారు. ఈ పర్యటన 25వ తేదీన ఏలూరులో మొదలవుతుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి, అక్కడి పనులను పరిశీలిస్తారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తారు.