గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీచేస్తున్న ఆది పినిశెట్టి

176

సినిమా ప్రచారాన్ని వినూత్న రీతిలో నిర్వహించడంలో దర్శకుడు సుకుమార్ తీరే వేరు. విలక్షణమైన కథలను తెరకెక్కించడంలో ఆయకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం మెగావర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ వినికిడి లపం ఉన్న పల్లూటూరి చిట్టిబాబుగా నటిస్తున్నారు.

ఇప్పటికే హీరో చరణ్, హీరోయిన్ సమంత లుక్స్, పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆది పినిశెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదలైంది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది.

ఈ పోస్టర్లో ‘ ‘  రంగస్థలం గ్రామపంచాయితీ ఎన్నికలలో ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె.కుమార్‌ బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి’  అని ఉంది. ‘ ఇలా డిఫరెంట్ గా ఆలోచించడం ఒక్క సుకుమార్ కే చెల్లింది అంటున్నారు.. రామ్ చరణ్ అభిమానులు.