చంద్రబాబు ను కలిసిన కథానాయకుడు సినిమా డైరెక్టర్ క్రిష్.

0

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కథానాయకుడు, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది జనవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జనవరి 11 ఉండవల్లిలో సీఎం చంద్రబాబును నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కలుసుకున్నారు. . ఈ సందర్బంగా ముఖ్యమంత్రి క్రిష్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నటించారని బాలకృష్ణను ప్రశంసించారు. అలాగే ఎన్టీఆర్ జీవితాన్ని, త్యాగాన్ని, కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చారంటూ దర్శకుడు క్రిష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.