నందమూరి అభిమానులతో కలిసి “కథానాయకుడు” చిత్రం చూసిన చెంగల వెంకట్రావ్ కుమార్తె విజయలక్ష్మి

0

క్రిష్ దర్శకత్వంలో ఎన్ బీ కే బ్యానర్ లో నందమూరి బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటించిన చిత్రం “ఎన్టీఆర్ కథానాయకుడు” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంలో విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ నిర్మాత చెంగల వెంకట్రావ్ కుమార్తె విజయలక్ష్మి పాయకరావు పేట రామకృష్ణ చిత్రమందిర్ థియేటర్ నందు చిత్రం విడుదల సందర్భంగా ఎన్.టి.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నందమూరి అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడమంటే సాధారణ విషయం కాదని, సినిమాను ఎంతో చక్కగా తీసారని ఆమె అన్నారు. ప్రేక్షకులు సినిమాను కుటుంబసమేతంగా ధియేటర్ కు వచ్చి చూడాలని ఆమె కోరారు. ఎన్.టి.ఆర్ మీదున్న అభిమానంతో చెంగల వెంకట్రావ్ గారు, బాలకృష్ణ హీరోగా “సమరసింహారెడ్డి” సినిమా తీశారని,ఆ చిత్రం ఈ థియేటర్లో 365 రోజులు ఆడిందని గుర్తుచేశారు. అభిమానులు అందరూ సినిమాను థియేటర్ కు కుటుంబ సమేతంగా వచ్చి వీక్షించాలని, పైరసీని ఎవరు ప్రోత్సహించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.