“ఎన్టీఆర్” వర్సెస్ “లక్ష్మీస్ ఎన్టీఆర్” ..

0

తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగతనేత, కథానాయకుడు నందమూరి ఎన్టీ రామారావు పాత్ర మరువలేనిది… పాత్ర ఏదైనా సరే పురాణాల్లోని పాత్రలు చెబితే ఠక్కున గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ఒక్కరే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంతో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో “ఎన్టీఆర్” రెండు భాగాలుగా విడుదలకు సిద్దమవుతోంది.. ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేశారు.. ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మహానాయకుడు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అనేక సంఘటనల ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తీస్తున్న విషయం మనకు తెలిసిందే .. ఇక ఈ రెండు చిత్రాల ప్రస్థవన ఎందుకు వచ్చిందంటే నిన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలు నిర్వహించగా .. రాంగోపాల్ వర్మ తన తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నుండి వెన్నుపోటు సాంగ్ విడుదల చేశారు.

బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ ని ( 2,790, 205 ) మిలియన్ మంది వీక్షించగా, ఆర్జీవి సినిమా పాటను (8,26,858) మిలియన్ మంది ప్రేక్షకులు వీక్షించారు. ఇక ఈ రెండు సినిమాలపై అటు రాజకీయాల్లోను, ఇటు సినిమా రంగంలో కూడా పెద్ద చర్చ జరుగుతోందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మెత్తం కూడా ప్రధాన పాత్ర చుట్టూనే చేశారు..ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడం మొదలు రాజకీయాల్లోకి ప్రవేశం వరకు అన్ని కూడా ప్రధాన పాత్ర చూట్టూనే ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఈ చిత్రం మొదటి భాగం ” కథానాయకుడు జనవరి 9వ తేదిన విడుదల కానుండగా, మహానాయకుడు ఫిబ్రవరి 7వ తేదిన విడుదల కానుంది”…

రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో వస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం జనవరి 24వ తేదిన విడుదల కానుంది… నిన్న విడుదల చేసిన వెన్నుపోటు పాట లో కూడా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో జరిగిన అనేక మార్పులు, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది, చంద్రబాబు నాయుడు కీలక పాత్రలుగా చూపుతూ కనిపించింది. మరి ఏది నిజం అన్నదానికన్నా రెండు చిత్రాలపై అటు నందమూరి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…