“ఎన్టీఆర్ బయోపిక్” లో ” పాయల్ రాజపుత్” కు అవకాశం.

43
ntr biopic krish ,direction , multi starer movie
ntr biopic krish ,direction , multi starer movie

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ స్క్రీన్ వరకు , జాన పద, పైరాణికం నుండి, మాస్ ఆడియన్స్ వరకు అందరిని అలరించిన కథానాయకుడు నందమూరి తారక రామారావుగారు..  జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్”.. ఈ చిత్రానికి   క్రిష్ దర్శకత్వ బాధ్వయతలు నిర్వహిస్తున్నారు..  ఈ చిత్రం లో ఎన్టీార్ నటించిన  అన్నిపాత్రలకు తగ్గట్టు గా నటి నటులు ఇప్పటికే ఖరారైనా విషయం తెలిసిందే..  తాజా గా మరో పాత్ర కు ఆర్ఎక్స్ 100 హీరోయిన్, పాయల్ రాజపుట్ కు ఈ సినిమా లో అవకాశంలభించింది ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు చిత్రపరిశ్రలో ఓ వెలుగు వెలిగి తెలుగు వారందరి చేత కీర్తింపబడిన మహ కథానాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న  ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది..  సహజ నటిగా వెడితెరపై ఓ వెలుగు వెలిగన జయసుధ పాత్ర కు పాయల్ ముఖకవళికలు , హావభావాలు , కరెక్టు గా జయసుధ కు సరిపోతాయ నే దర్శక నిర్మాతలు పాయల్ ను తీసుకున్నట్లు సమాచారం …

ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ లో గతంలో డ్రైవర్‌ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.