హైదరాబాద్ లో కిలో ఉల్లి రూ.170.. చరిత్ర తిరగరాసింది

62

ఉల్లిపాయ. కోస్తే నీళ్లు వస్తాయి. ఇప్పుడు చూస్తే చాలు గుండె గుబేల్ అంటోంది. హైదరాబాద్ లో కిలో ఉల్లి 170 రూపాయలు టచ్ అయ్యింది. భారతదేశంలోనే ఉల్లి ఎక్కువ ధర పలుకుతుంది హైదరాబాద్ లోనే కావటం షాక్ కు గురి చేస్తోంది. హైదరాబాద్ లో కిలో ఉల్లి 170 రూపాయలు ఉంటే.. ముంబైలో 120గా ఉంది. చెన్నై, కోల్ కతాలో కిలో 100 రూపాయలుగానే ఉంది.

ఉల్లి కోసం యుద్ధాలు జనం :
కిలో ఉల్లిపాయ 170 రూపాయలు. ఇది మామూలు విషయం కాదు. సాధారణ రోజుల్లో నలుగురు ఉండే ఇంట్లో కనీసం పావు కిలో వాడేస్తారు. అంటే ఈ లెక్కన ప్రస్తుతం అయితే రోజుకు ఉల్లిపాయలకే 35 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు వెయ్యి రూపాయలు ఉల్లికే మటాష్. దీంతో సామాన్య జనం.. ప్రభుత్వం అందించే సబ్సిడీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. తోపులాటలు జరుగుతున్నాయి. కొట్లాటలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో అయితే క్యూలో గొడవలు జరిగాయి. ఓ వృద్ధుడిని అయితే ఏకంగా లాగి పడేశారు. ముసిలోడివా తొక్కా.. నీకేం స్పెషల్ లేదు ఇక్కడ అంటూ తీసి అవతల పడేశారు జనం.

హైదరాబాద్ లో ఆల్ టైం హైలో ఉల్లి ధర :
దేశవ్యాప్తంగా ఉల్లి ధర సెంచరీ దాటితే.. హైదరాబాద్ లో మాత్రం 175 రూపాయలకు చేరింది. చరిత్రలో కనీవినీ ఎరుగని ధర ఇది. దేశవ్యాప్తంగా ఇదే హయ్యస్ట్ రేట్ కావటంతో ప్రజలు షాక్ లో ఉన్నారు. ఏపీలో అయితే కిలో ఉల్లి 25కే ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణలో ఆ ఏర్పాట్లు కూడా లేవు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరుకు దిగుమతి చేయాలని చూస్తున్నా.. అక్కడ కూడా అందుబాటులో లేదు. దీంతో ధర కూడా దిగి రావటం లేదు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు వ్యాపారులు. అప్పటి నుంచి ఉల్లి లేని కూడా కూరలు తప్పవంటున్నారు.